అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రంజాన్ మాసం సందర్భంగా నగరంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. ఈ మేరకు బుధవారం ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి ఒకటి నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, తీవ్రమైన ఎండల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా D1, D6 సబ్ స్టేషన్ ఏరియాలో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచి సహకరించాలని కోరారు.