అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: మసీదులో వస్తువులను ధ్వంసం చేయడానికి యత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగారంలోని 80 క్వార్టర్స్‌లోని ఓ మసీదులో దుండగుడు ప్రవేశించి యాంప్లిఫైర్, మైక్‌లను ధ్వంసం చేసేందుకు యత్నించాడని వివరించారు. నిందితుడిని పట్టుకుని శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు పాల్గొన్నారు.