అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 5న జిల్లాకు రానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పాల్గొననున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి మున్సిపాలిటీలో రూ.93కోట్లతో తాగునీటి వసతి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేయనున్న సభలో మంత్రి మాట్లాడనున్నారు.