అక్షరటుడే, ఇందూరు : మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు అంకితం అయ్యారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగత సభలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటివరకు ఒకసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. 39 మంది ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీకి వచ్చెనందుకు ముఖం చెల్లడంలేదన్నారు. గత పదేళ్ల లో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క పోరాడారని గుర్తు చేశారు.