అక్షరటుడే, వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. కాగా కుల గణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఆదివారం చర్చించిన విషయం తెలిసిందే. ఈ నెల 4న కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక ఫిబ్రవరి చివరివారం లేదా మార్చి తొలి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.