అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్లీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం స్పందించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశామన్నారు. ఇప్పుడు చేసేది రీసర్వే కాదని, గతంలో వివరాలు ఇవ్వని వారికోసం మాత్రమేనని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేవని మంత్రి ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకమని బీజేపీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చిందన్నారు.