అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదని.. బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసమే కులగణన సర్వే చేశామన్నారు. రాజ్యాంగ సవరణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీజేపీనుద్దేశించి మాట్లాడారు. అలాగే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం కమిషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు.