అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతన్న పొదుపు కోసం బడ్జెట్‌లో రూ.115 కోట్లు కేటాయించామన్నారు. నేతన్న భద్రత కోసం రూ.9 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నేతన్న భరోసా పథకానికి రూ.44 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.