అక్షరటుడే, వెబ్‌డెస్క్: రేషన్ కార్డులపై అపోహలు పెట్టుకోవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ నెల 26 నుంచి అర్హులందరికీ కొత్త కార్డులు అందజేస్తామన్నారు. కుల గణన జాబితాలో ఉన్నా, లేకున్నా.. ప్రజా పాలన, గ్రామసభల్లో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా నూతన రేషన్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. కొత్త కార్డులకు సంబంధించి ఇప్పటికే జాబితా రాగా అందులో పేరు లేని వారు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. పాత రేషన్ కార్డులు తొలగించమని, అందులో కొత్తవారిని చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.