అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. శుక్రవారం ఆయన నగరంలోని నాగారం రాజారాం స్టేడియం, తిలక్ గార్డెన్లో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.