అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

0

అక్షరటుడే, ఇందూరు: మున్సిపల్ అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ సూచించారు. మంగళవారం నగరంలోని 36వ డివిజన్‌ జోన్‌-1 కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పలు డివిజన్లలో కార్మికుల పనితీరు, డ్రెయినేజీ, చెత్త సేకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. అధికారులు, కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కానీ.. తప్పు చేస్తే మాత్రం ఉపేక్షింబోనని హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్స్ తదితరులున్నారు.