అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బీఆర్‌ఎస్‌ నాయకులు పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని, మీ అవినీతిలో నేను భాగస్వామిని కావొద్దనే పార్టీమారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ తాను ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే జనగామ గడ్డపై ముక్కు నేలకు రాస్తా. తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేలఎకరాలు దోచుకున్నారు. ఫామ్‌హౌస్‌లు, ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు. జైలుకు వెళ్తాడని కేటీఆర్‌కు భయం పట్టుకుంది. తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’’ అని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు.