తన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను రెచ్చగొట్టే ఏపీ ఎమ్మెల్యే కొడాలి నాని నటుడు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలపై సర్ది చెప్పుకున్నారు.
అమరావతి : తన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను రెచ్చగొట్టే ఏపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Mla Kodali Nani) నటుడు చిరంజీవి 9Chiranjeevi) పై చేసిన వ్యాఖ్యలపై సర్ది చెప్పుకున్నారు. తాను అలా అనలేదని స్పష్టం చేశారు. చిరంజీవి రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చారు. తాము స్వీకరించామని, తాను కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సలహాలు ఇచ్చానని వివరించారు.
చిరంజీవి పుట్టినరోజుల వేడుకల్లో పాల్గొన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. తన వెంట ఉన్నవాళ్లలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోని కొందరు డ్యాన్స్, యాక్షన్ రాని , సినిమాలు తీయరాని పకోడిగాళ్లు రాజకీయం జోలికి రావొద్దని అన్నానని వివరించారు.
రాజకీయం గురించి మాట్లాడే అలాంటి పకోడి వ్యక్తులకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నానని తెలిపారు. చిరంజీవి గురించి కాదని అన్నారు.చిరంజీవిపై వ్యాఖ్యలు చేయలేదని నిరూపించడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని , తమ ఇద్దరి మధ్య అగాధం సృష్టించలేరని పేర్కొన్నారు.