అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలో బస్ డిపో నిర్మించాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిలో బస్ డిపో నిర్మించాలని 40ఏళ్లుగా డిమాండ్ ఉందని, ఇందుకోసం అనేకసార్లు ఉద్యమం చేసినట్లు మంత్రికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బస్ డిపో నిర్మించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.