విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Date:

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని అధికారులు, వైద్యులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు హెచ్చరించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. సరైన వైద్యం చేయకుంటే ఎవరినైనా ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్‌, ప్రభుత్వ వైద్యాధికారి రవీంద్ర మోహన్‌, కాంగ్రెస్‌ నాయకుడు కురుమ సాయిబాబా తదితరులున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, మేనేజర్ మధ్య వాగ్వాదం

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు, మేనేజర్ హయ్యూమ్...

నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు, రక్షణ శాఖమంత్రి యోవ్‌...

ఆరుగురిపై డ్రంకన్ డ్రైవ్ కేసు

అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద...

కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి...