అక్షరటుడే, ఎల్లారెడ్డి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు టెన్త్, ఇంటర్ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు బియ్యం దొడ్డుగా వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన బియ్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని గుత్తేదారులను ఆదేశించారు.