అక్షరటుడే, ఎల్లారెడ్డి: కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. మంగళవారం మంత్రిని కలిసి కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వయా తాడ్వాయి – ఎర్రపహాడ్ – లింగంపేట్ రోడ్ 4 లైన్లకు ప్రతిపాదనలు చేయాలని, అలాగే హైవేగా పరిగణించాలని విన్నవించారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి కేంద్ర జాతీయ రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిపాదనలు సైతం కేంద్రానికి పంపాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.