అక్షరటుడే, ఎల్లారెడ్డి: క్రిస్టియన్‌, మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మదన్మోహన్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీకేవీ ఫంక్షన్‌ హాల్‌లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొని.. కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది క్రిస్మస్‌ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ క్రైస్తవులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ రజిత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు.