అక్షర టుడే, ఎల్లారెడ్డి: చెరుకు రైతులకు ప్రభుత్వం, నూతన పాలకవర్గం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. గురువారం మర్కల్ అశోక్ గార్డెన్స్ లో చెరుకు అభివృద్ధి కమిటీ (CDC) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ముందుగా ఛైర్మన్ ఇర్షాద్ ఉద్దిన్, డైరెక్టర్లు పీర్ రెడ్డి, నరేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరుకు రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని ఛైర్మన్, గాయత్రి షుగర్స్ యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.