అక్షరటుడే, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసమే ఎంపీ అరవింద్ పసుపు బోర్డు డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం తప్ప పార్లమెంట్ పరిధిలో అరవింద్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. దేవుని పేరుచెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో14-15 స్థానాలు గెలుస్తుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హందాన్, కేశ వేణు, అంతిరెడ్డి రాజారెడ్డి, ఇర్ఫాన్, ఖుద్దుస్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.