అక్షరటుడే, కోటగిరి: మండలంలోని బస్వాపూర్ దత్తాత్రేయ ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలన్నారు. గ్రామ ప్రజలకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజ్, ఏఎంసీ ఛైర్మన్ హనుమంతు, మాజీ జడ్పీటీసీ సభ్యులు శంకర్ పటేల్, బస్వాపూర్ శ్రీధర్, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.