అక్షరటుడే, బాన్సువాడ: ఆసుపత్రిలో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి స్థలాన్ని వీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, శ్రీను నాయక్, నాయకులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ నార్ల సురేష్ గుప్తా, నాయకులు ఎజాస్, హకీమ్ ,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.