అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థుల మేధస్సును వెలికితీసినప్పుడే వారు మరింత చురుకుగా మారతారని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో సైన్స్ ఫెయిర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్ తదితరులు పాల్గొన్నారు.