అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం సందర్శించారు. కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు. కళాశాల పూర్వ విద్యార్థులందరూ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాలేఖ్, ఎజాస్, గురువినయ్, నార్ల సురేష్, గోపాల్ రెడ్డి, దావూద్, నార్ల ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.