అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: ఆత్మహత్య చేసుకున్న రైతు పీర్​సింగ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి పరామర్శించారు. బాల్కొండలో శనివారం రైతు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. రైతును పరామర్శించిన వారిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, పువ్వాడ అజయ్​, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​, రసమయి బాలకిషన్​, మాజీ జెడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్​రావు ఉన్నారు.