అక్షరటుడే, ఆర్మూర్: ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆంధ్ర నగర్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేశారని ప్రశ్నించారు. ఇళ్లు, రేషన్ కార్డులు నాయకులకు ఇచ్చారా.. పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుపేదలకు పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.