అక్షరటుడే, ఆర్మూర్​: నందిపేట్‌ మండలం చౌడమ్మ కొండూరులోని ఆలయంలో కల్యాణ మండప నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలయంలో నిర్వహించిన శత చండీయాగంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ రాజు, సాయి, మహేందర్, రాజు తదితరులున్నారు.