అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అన్నారు. గ్రామసభలతో ప్రజల మధ్య కాంగ్రెస్ గొడవలు పెడుతోందని ఆరోపించారు. ఒక్క గ్రామంలో అయినా లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహిస్తే.. మంత్రులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.