అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ను బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నీటి విడుదల వల్ల రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం రెంజల్, నవీపేట్, బోధన్ మండలాల్లో పర్యటించారు. హంగర్గ గ్రామంలో రైతులతో మాట్లాడారు. సోయాబీన్ పంట మరికొన్ని రోజుల్లో చేతికి రానున్న తరుణంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీ వరదలతో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, తహశీల్దార్ విఠల్ తదితరులున్నారు.