అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గడ్డం వెంకటస్వామి(కాకా) ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా కాకా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నుడా ఛైర్మన్ కేశవేణు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు.