అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: హోటల్ మేనేజ్ మెంట్ కోర్సుతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని గంగాస్థాన్ -1లో యూవీ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. జిల్లాలో హోటల్ మేనేజ్ మెంట్ కాలేజ్ నెలకొల్పడం ఇక్కడి నిరుద్యోగులకు వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో కాలేజ్ నిర్వాహకుడు సుజన్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.