అక్షరటుడే, బోధన్: ప్రజలు మత సామరస్యంతో మెలగాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్‌లో గల సీఎస్ఐ చర్చిలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బ్రదర్ అనంతయ్య చౌదరి, చర్చి అధ్యక్షుడు జ్యోతిరావు పాల్గొన్నారు.