అక్షరటుడే, జుక్కల్: వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. శనివారం నిజాంసాగర్ మండలం వెలగనూరు, మంగ్లూరు, నర్సింగరావుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కృష్ణారెడ్డి, ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.