అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి, దోమకొండలోని మార్కండేయ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు మ్యక నాగరాజు, బొమ్మెర గంగాధర్, అందె గణేష్, మహాదేవ్, జగదీష్, అనిల్, ప్రవీణ్, బత్తిని సిద్ధ రాములు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.