అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జాగృతి కార్యకర్తలంతా పునరుత్తేజమవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా జాగృతి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెట్రోల్‌ను రూ.40కే ఇస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మరిచారన్నారు. మహిళలు, వృద్ధులు, మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జాగృతి ప్రతినిధి నవీనా చారి, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అవంతిరావు తదితరులు పాల్గొన్నారు.