అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బీసీ మహాసభను సక్సెస్‌ చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బుధవారం ఆమె నివాసంలో సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలు సభకు తరలిరావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల రాష్ట్ర నాయకుడు హరిప్రసాద్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.