అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేయడానికి ‘పార్టీ ఏమైనా మీ అయ్యా జాగీరా’ అని ప్రశ్నించారు. పార్టీ బీసీలది అని, దానిని వాడుకొని కొందరు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరిగితే పండబెట్టి తొక్కుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుల గణన సర్వే నివేదిక తప్పని ఆయన అన్నారు. కాగా సొంత పార్టీ, ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వైరలు అవుతున్నాయి.