అక్షరటుడే, జుక్కల్: జాతీయ రహదారి 765/డి విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్నామని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన పలువురు బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో తాము నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరువైపులా 50 ఫీట్ల మేర రోడ్డు పనులు కొనసాగుతున్నాయని, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో 5 ఫీట్లు తగ్గించి, సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు ఇరువైపులా డ్రైనేజీ సదుపాయం కల్పించి తమను ఆదుకోవాలని కోరారు.