అక్షరటుడే, ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్​పల్లి పంచాయతీ పరిధిలోని గోల్యా నాయక్ తండాకు చెందిన మోహన్ నాయక్(43) సౌదీలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం అతను అనారోగ్యానికి గురవడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మోహన్​నాయక్​ మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.