అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మోపాల్ ఎస్సై యాదగిరి తెలిపారు. మండలంలోని కస్బాగ్ తండాకు చెందిన హరిసింగ్ ఆదివారం అర్ధరాత్రి ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.