అక్షరటుడే, బాన్సువాడ: ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టనున్న బస్సు జాతరను జయప్రదం చేయాలని మోస్రా మండల యూనియన్ అధ్యక్షురాలు ఆసియా పిలుపునిచ్చారు. మంగళవారం పీహెచ్‌సీ ఎదుట బస్సు జాతర పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి రాణి, పుష్ప, స్వాతి, స్రవంతి పాల్గొన్నారు.