అక్షరటుడే, ఇందూరు: తిరుపతి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ జయంతి సందర్భంగా బైపాస్ రోడ్డులోని ఘాట్ వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో లడ్డూ విషయంపైనే కాకుండా అనేక అంశాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డారన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ గా కాకుండా సెక్యులర్ గా ఉండాలని వ్యాఖ్యానించారు.