అక్షరటుడే, ఇందూరు: ప్రజలను మోసం చేసి అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాల్​కల్ రోడ్డులో గల మున్నూరుకాపు సంఘం ఫంక్షన్ హాల్​లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను కులాల వారీగా విభజించి, ముస్లింలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ ఏకమై కాంగ్రెస్​కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య సమాజ సేవకుడు, ఉపాధ్యాయుల సమస్యలు తెలిసినవారన్నారు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా, కొండ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.