అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్‌లో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులు ఒప్పుకోకపోయినా ప్రలోభాలకు గురై చేసి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు సలహాలు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడంలేదని, గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. అర్హత లేని సీఎం రేవంత్ సోదరుడు లగచర్లకు వెళ్తే ఆహ్వానం పలికిన పోలీసులు, స్థానిక ఎంపీ డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తనపై దాడి జరగలేదని కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా గ్రామాలపై పడి రాత్రికి రాత్రే ప్రజలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే అధికారులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరించారు.