అక్షరటుడే, కామారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, జిల్లాను అన్నింటా ముందుంచాలని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ‘దిశ’ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల వినియోగం, పనుల పురోభివృద్ధిపై మూడునెలలకు ఒకసారి నిర్వహించే దిశ సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. అనంతరం పలువురు వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా, పరిష్కరించాలని ఆయా శాఖాధికారులకు సూచించారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్, అడిషనల్‌ కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, విక్టర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ ఛైర్మన్లు ఇందుప్రియ, సతీష్, గంగాధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.