అక్షరటుడే, నిజాంసాగర్: ఇందిరమ్మ సర్వేను తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఎంపీడీవో గంగాధర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై చర్చించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరును ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుమలత పంచాయతీల వారీగా అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏపీవో శివకుమార్, మండల పంచాయతీ అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.