అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: హెచ్ఐవీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా దోమకొండలో శనివారం వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు, లింక్ వర్కర్ బాలకిషన్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, పీజీ హెచ్ఎం శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.