అక్షరటుడే, భీమ్గల్: పట్టణంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, నర్సరీల వివరాలను ఆరా తీశారు. ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులపై సిబ్బందితో చర్చించారు.