అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ నగరంలో ఈనెల 9న మాదిగల నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక మోహన్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయట్లేదన్నారు. అందుకు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు.