అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో ఇప్పటివరకు 8 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ ఏర్పాటు చేశామని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సదాశివనగర్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన చైల్డ్-ఫ్రెండ్లీ కార్నర్స్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన సదాశివనగర్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైల్డ్-ఫ్రెండ్లీ కార్నర్స్ ద్వారా ఎవరైనా పోలీసు స్టేషన్‌ను సందర్శించినప్పుడు వారి పిల్లలు అక్కడ ఎలాంటి భయంలేకుండా అక్కడ ఆడుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూరు, ఎల్లారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో ఎల్లారెడ్డి, సదాశివనగర్, గాంధారి, బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బిచ్కుంద పోలీసు స్టేషన్లలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌లలో ఈ ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎస్పీ సింధుశర్మ, ఏఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

సదాశివనగర్‌లో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ సింధు శర్మ

దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్